: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. హెవీ వెయిట్ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీల షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో మార్కెట్లు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్ల లాభంతో 26,587కి పెరిగింది. నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 8,014కు చేరుకుంది. ఇవాల్టి టాప్ గెయినర్లలో కైలాష్ ఆటో ఫైనాన్స్ లిమిటెడ్, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, ఫ్యూచర్ రీటెయిల్, జైప్రకాశ్ అసోసియేట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లు ఉన్నాయి. టాప్ లూజర్ల జాబితాలో ఇన్ఫోసిన్, రతన్ ఇండియా పవర్, జెట్ ఎయిర్ వేస్, పీఎంసీ ఫిన్ కార్ప్, హెక్సావేర్ టెక్నాలజీస్ లు ఉన్నాయి.