: అమాయకుడైన రేవంత్ ను చంద్రబాబు బలి చేశారు: సి.రామచంద్రయ్య


దివంగత ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడితే... ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు వారి పరువు తీస్తున్నారని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. ఓటుకు నోటు వ్యవహారంలో తాను తప్పు చేయలేదని, ఆడియో టేపుల్లోని గొంతు తనది కాదని చంద్రబాబు చెప్పడం లేదని అన్నారు. ఈ కేసులో అమాయకుడైన రేవంత్ రెడ్డిని చంద్రబాబు బలిపశువును చేశారని ఆరోపించారు. జనాలను వాడుకుని వదిలేయడం చంద్రబాబుకు ముందు నుంచే అలవాటని అన్నారు. పరకాల ప్రభాకర్ లాంటి కాంట్రాక్టు ఉద్యోగులు నోటికి వచ్చినట్టు వాగుతున్నారని... ప్రభాకర్ ఓ పిచ్చివాడని ఎద్దేవా చేశారు. ఏ తప్పూ చేయకపోతే, ఢిల్లీ వెళ్లి మోదీ చుట్టూ తిరగాల్సిన అవసరం చంద్రబాబుకు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News