: అక్రమ్ రికార్డ్ బ్రేక్ చేసిన హర్భజన్


భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ టెస్టుల్లో మరో రికార్డు నమోదు చేశాడు. బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టులో మూడు వికెట్లు తీయడం ద్వారా హర్భజన్ సింగ్ పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ రికార్డును అధిగమించాడు. అక్రమ్ 104 మ్యాచుల్లో 414 వికెట్లు తీయగా, హర్భజన్ 102 టెస్టుల్లో 416 వికెట్లు తీశాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో భజ్జీ 9వ స్ధానంలో నిలిచాడు. భారత్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో అనిల్ కుంబ్లే 619 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా, కపిల్ 434 వికెట్లు తీసి రెండో స్ధానంలో ఉన్నారు. భజ్జీ మరో 20 వికెట్లు తీస్తే ద్వితీయ స్థానం చేరుకునే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News