: భార్య సంపాదన విషయంలో మారిన యువకుల ఆలోచనాధోరణి!
కాబోయే భార్య తమకన్నా ఎక్కువ సంపాదిస్తే అభ్యంతరం ఎందుకని యువకులు ప్రశ్నిస్తున్నారు. వివాహ బంధాలు కుదిర్చే ఓ సంస్థ చేపట్టిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 22 నుంచి 32 మధ్య వయసున్న 12,590 మంది పెళ్లికాని యువతీ యువకులకు ఆన్ లైన్ లో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 7285 మంది యువకులుండగా, 5,305 మంది అమ్మాయిలున్నారు. యువకుల్లో 32.1 శాతం మంది, తమ భార్యలు తమకన్నా ఎక్కువ సంపాదిస్తే తమకేం అభ్యంతరం లేదని అభిప్రాయపడ్డారని సర్వే తెలిపింది. 33.7 శాతం మంది మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో 34.2 శాతం మంది ఏ అభిప్రాయమూ చెప్పలేమన్నారు. యువతుల్లో 23.4 శాతం మంది మాత్రమే తమ కంటే తమ భర్త సంపాదన తక్కువైనా పర్లేదని పేర్కొన్నారు. మొత్తానికి భర్త, భార్య సంపాదన విషయంలో యవతరం ఆలోచనల్లో మార్పులు సంభవించినప్పటికీ సంప్రదాయబద్ధంగానే ఆలోచిస్తున్నట్టు కనబడుతోందని సర్వే అభిప్రాయపడింది.