: నాణ్యత వచ్చేదాకా ఆ స్టాంపు పడదు: కెమెరామన్ సెంథిల్ కుమార్
తిరుపతిలో బాహుబలి ఆడియో వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న సుమ తన వాక్చాతుర్యంతో అందరినీ అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బాహుబలి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ను వేదికపైకి పిలిచారు. సెంథిల్ రాగానే ఆయనను ఓ ప్రశ్న అడిగారు. సినిమా ఆలస్యానికి కారణం ఏంటని ఆరా తీసే ప్రయత్నం చేశారు. దర్శకుడు రాజమౌళి నాణ్యతకు పెద్దపీట వేస్తారని, తనకు నచ్చేదాకా పట్టువదలడని, అందుకే ఆలస్యమైందని వివరించారు. నాణ్యత వస్తే గానీ రాజమౌళి స్టాంపు పడదా? అన్న ప్రశ్నకు సెంథిల్ జవాబిస్తూ, అవునండీ, సినిమా తనకు నచ్చిన విధంగా వచ్చేదాకా రాజమౌళి స్టాంపు వేయరని తెలిపారు.