: టి.సర్కారు విధానాలను స్వాగతించిన జేపీ


లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న విధానాలను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. పారిశ్రామిక విధానం బాగుందని కితాబిచ్చారు. ఈ పద్ధతిలో, అనుమతులు ఆలస్యమైతే జరిమానా తప్పదని సంబంధిత విభాగాలకు, అధికారులకు స్పష్టం చేయడం హర్షణీయమన్నారు. కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారంటూ సర్కారును అభినందించారు. అయితే, ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'మిషన్ కాకతీయ'లో ప్రజలకు అధిక భాగస్వామ్యం కల్పించాలని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News