: మూడు కి.మీ దాటిన 'శ్రీవారి' క్యూలైన్
ఒకవైపు వారాంతం, మరోవైపు వేసవి సెలవుల ముగింపు నేపథ్యంలో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గత నాలుగు రోజులుగా రద్దీ అధికంగానే ఉండగా, ఈ ఉదయానికి మరింత మంది భక్తులు శ్రీవారి దర్శనం నిమిత్తం తిరుమలకు వచ్చారు. దీంతో, వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్టుమెంట్లూ నిండిపోగా, వెలుపల 3 కిలోమీటర్లకు పైగా క్యూ లైన్ పెరిగింది. ఈ మధ్యాహ్నం కాసేపు వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, సర్వదర్శనానికి 28 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. క్యూలైన్లలో వేచివున్న భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్టు వివరించారు.