: రేవంత్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది: కిషన్ రెడ్డి
ఓటుకు నోటు వ్యవహారంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పంతానికి పోకుండా రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. చట్టాలను ఎవరూ ప్రభావితం చేయలేరని అన్నారు. ఇక, వరల్డ్ యోగా డే సందర్భంగా ఈ నెల 21న హైదరాబాద్ సుందరయ్య పార్కులో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు పెద్ద ఎత్తున హాజరవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.