: ఫోన్ ట్యాపింగ్ కిటుకులు నేర్పింది చంద్రబాబేగా!: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోపణ
ఇతరుల ఫోన్లను ట్యాపింగ్ చేసే చిట్కాలను తెలుగు ప్రజలకు పరిచయం చేసింది ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడేనని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని పార్టీ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి, చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు. తమ పార్టీ టీఆర్ఎస్ తో కుమ్మక్కైందని చెబుతున్న చంద్రబాబు, 2009 ఎన్నికల్లో సదరు తెలంగాణ పార్టీతో కలిసి పోటీ చేసింది ఎవరని ప్రశ్నించారు. వైసీపీ, టీఆర్ఎస్ మధ్య కుమ్మక్కు లేదని ఆయన తేల్చిచెప్పారు. తాను తప్పు చేసి ఆ తప్పు ఆంధ్రా ప్రజలు చేసినట్లుగా చంద్రబాబు చూపిస్తున్నారని చెవిరెడ్డి ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు డబ్బు తెచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు.