: చిలిపి పందెం కడితే, చుక్కలు చూపించిన చీమలు!


"నా బంగరు పుట్టలో వేలు పెడితే... కుట్టనా?" అనే చీమ కథ చిన్నప్పడు అందరమూ పదే పదే విన్న కథే. తన సరదా తీర్చడం కోసం చిలిపి పందెం కట్టిన థాయ్ లాండ్ వాసి రేయాంగ్, చీమల పుట్టతో పెట్టుకున్నాడు. అవి చుక్కలు చూపించగా లబలబలాడి పోయాడు. వివరాల్లోకి వెళితే, రేయాంగ్ తన స్నేహితులతో ఒంటిపై చీమలను వేయించుకుంటానని పందెం కట్టాడు. స్నేహితులతో కలసి చీమలను సేకరించేందుకు ఓ పుట్టకు నిప్పు పెట్టారు. చీమలను సేకరించారు. పందెం ప్రకారం, ఒంటిపై బట్టలిప్పి నిలబడ్డ రేయాంగ్ అండర్ వేర్ లో స్నేహితులు ఎర్ర చీమలను వేశారు. అవి తమ పగను తీర్చేసుకున్నాయి. పెడబొబ్బలు పెడుతూ, చెడ్డీని కూడా విప్పేసి రోడ్లపై పరుగులు పెట్టాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండగా, 'తగిన శాస్తి జరిగిందిలే' అంటూ కామెంట్లు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News