: నిజామాబాదులో దోపిడీ దొంగల బీభత్సం... కత్తులతో స్వైరవిహారం


నిజామాబాదులో నిన్న రాత్రి దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. నగరంలోని గౌతం నగర్ కు చెందిన ఓ ఇంటిలోకి చొరబడ్డ ఆరుగురు దొంగలు, కత్తులు చేతబట్టి అరిస్తే చంపేస్తామంటూ ఆ ఇంటిలోని కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం ఇంటిలోని 7 తులాల బంగారం, రూ.80 వేల నగదు దోచుకున్నారు. తదనంతరం ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉన్న కారులో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత షాక్ నుంచి తేరుకున్న బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News