: ఏడుగురిలో ఒకరిని పట్టేసింది...ఇద్దరూ వేట మొదలెట్టారు!


మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. మరి, అలాంటప్పుడు మనలాగే ఉన్న మిగిలిన ఆరుగుర్ని కలుసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? వారిని ఎలా వెదికి పట్టుకునేది అనుకుంటున్నారా? నేటి సాంకేతిక ప్రపంచంలో అసాధ్యం అన్నది ఏదీ లేదని నియామ్ అనే ఓ అమ్మడు భావించింది. ఆలోచన వచ్చిందే తడవుగా డబ్లిన్ లో నివాసముండే నియామ్ రెండు నెలల క్రితం ఒక వీడియోను నెట్ లో అప్ లోడ్ చేసింది. ఫేస్ బుక్, యూ ట్యూబ్ లలో 70 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారట. ఈ వీడియోను వీక్షించిన ఇటాలియన్ రివేరాలోని జెనోవా పోర్ట్ టౌన్ లో ఉండే లూయిసా స్పందించింది. దీంతో నియామ్ వెళ్లి లూయిసాను కలిసింది. ఇద్దరూ ఒకేలా ఉండడంతో వారి ఆశ్చర్యానికి అంతులేదు. వీరిద్దరూ అచ్చం ఒకేలా ఉండడంతో లూయిసా స్నేహితులు, తల్లి కూడా నియామ్ ను లూయిసా గానే భావించారట. దీంతో ఆనందంలో మునిగిపోయిన వీరిద్దరూ, మిగిలిన ఐదుగురిని కూడా గుర్తించాలని భావిస్తున్నారట. వీరిద్దరూ కలిసి ఓ వీడియో రూపొందించారు. అదిప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News