: జంటనగరాల్లో పలు చోట్ల భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం
జంటనగరాల్లో శుక్రవారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాదులో సచివాలయం, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం... సికింద్రాబాదులోని మెట్టుగూడ, వారాసిగూడ, పార్శీ గుట్ట, అడ్డగుట్ట ప్రాంతాలు భారీ వర్షంతో జలమయమయ్యాయి. వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు.