: ట్విట్టర్ నుంచి తప్పుకున్న బాస్ డిక్ కోస్టోలో, కొత్త చీఫ్ జాక్ డోర్సీ!


ప్రముఖ సామాజిక మాధ్యమ వెబ్ సైట్ ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవీ బాధ్యతల నుంచి డిక్ కోస్టోలో తప్పుకోనున్నారు. తన స్థానంలో వేరొకరిని నియమించాలని ఇప్పటికే ఆయన బోర్డును కోరిన సంగతి తెలిసిందే. జూలై 1 న ఆయన సీఈఓ పదవి నుంచి తప్పుకుంటారని తెలుస్తోంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు, గతంలో కొంతకాలం సీఈఓగా ఉన్న జాక్ డోర్సీ తాత్కాలిక చీఫ్ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. కాగా, కోస్టోలో గత ఐదేళ్లుగా ట్విట్టర్ బాధ్యతలను మోస్తున్నారు. గత సంవత్సరం టాప్ మేనేజ్ మెంటులో అత్యధిక మందిని తొలగించిన ట్విట్టర్, వారి స్థానాల్లో కొత్తవారిని నియమించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News