: జగన్! మీ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయండి: సోమిరెడ్డి సలహా
ఏపీలో ప్రతిపక్షం వైసీపీ, తెలంగాణలో అధికార పక్షం టీఆర్ఎస్ కు అనుబంధంగా పనిచేస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. స్వప్రయోజనాలే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ తో జతకట్టి టీడీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆయన విమర్శించారు. సర్దుబాటుకు స్వస్తి చెప్పి జగన్ తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసేసి కేసీఆర్ కింద పనిచేస్తే బాగుంటుందని సోమిరెడ్డి అన్నారు. సీమాంధ్రులను కించపరిచేలా వ్యాఖ్యానించడం తెలంగాణ సీఎం కేసీఆర్ కు తగదని ఆయన అన్నారు. తక్షణమే కేసీఆర్ తన భాష మార్చుకోవాలని సూచించారు.