: అద్దెకు దొరికితే అపార్ట్ మెంట్ల నుంచే పాలన...హైదరాబాదు నుంచి వెళ్లిపోతాం: యనమల
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో అధికారాలపై నిత్యం రాద్ధాంతమే. తమ ప్రాంతం నుంచి తరలివెళ్లాలన్న తెలంగాణవాదుల మాటలు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని బాగానే ఇబ్బంది పెట్టినట్టున్నాయి. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన నవ్యాంధ్ర రాజధాని సమీపంలోని విజయవాడలో అద్దెకు దొరికితే అపార్ట్ మెంట్ల నుంచి కూడా పాలన సాగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. విజయవాడ నుంచి పాలన సాగించేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నా, ఒక్క క్షణం కూడా హైదరాబాదులో ఉండమని ఆయన తేల్చిచెప్పారు.