: బంగ్లా స్పిన్నర్లు తిప్పేస్తున్నారు... కోహ్లీ సహా ముగ్గురు అవుట్
ఒక రోజంతా వర్షానికి తడిసి తేమతో నిండిన ఢాకా పిచ్ స్పిన్నర్లకు మంచి సహకారాన్ని అందిస్తోంది. నేడు మూడో రోజు ఆటలో భాగంగా స్పిన్నర్లు రాణించడంతో ఇండియా మూడు వికెట్లను కోల్పోయింది. ఈ ఉదయం 173 పరుగుల వ్యక్తిగత స్కోరుతో, 283 పరుగుల వద్ద ధావన్ తొలి వికెట్ రూపంలో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఆపై రోహిత్ శర్మ 9 బంతుల్లో 6 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆపై వచ్చిన కెప్టెన్ కోహ్లీ కూడా తక్కువ స్కోరుకే జుబైర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. 22 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 14 పరుగులు చేశాడు. దీంతో 27 పరుగుల తేడాలో ఇండియా మూడు వికెట్లు కోల్పోయినట్లయింది. ప్రస్తుతం భారత స్కోరు 82 ఓవర్లలో 344/3.