: మీ జాగ్రత్తలు మమ్మల్ని కించపరుస్తున్నాయి: యాపిల్ చీఫ్ టిమ్ కుక్ కు ఉద్యోగుల లేఖాస్త్రం
యాపిల్ రిటైల్ స్టోర్లలో సెక్యూరిటీ పరమైన జాగ్రత్తల పేరిట ఉద్యోగులను తనిఖీ చేయడం, వారి బ్యాగులను చెక్ చేస్తుండడంపై ఉద్యోగులు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ కు లేఖలు రాశారు. ఈ చర్యలు తమను కించపరిచేవిగా ఉన్నాయని, ఈ తనిఖీలను తాము అవమానకరంగా భావిస్తున్నామని రాశారు. 2013లో వేసిన ఓ కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈ లేఖలను బహిర్గతం చేశారు. యాపిల్ స్టోర్ మేనేజర్లు ఉద్యోగులను నేరస్తుల మాదిరిగా చూస్తున్నారని వారు ఆ లేఖలో ఆరోపించారు. కాగా, తనకు అందిన లేఖలను "ఇది నిజమా?" అని ప్రశ్నిస్తూ, హెచ్ఆర్ విభాగం అధిపతికి పంపారు. మానవ వనరుల విభాగం నుంచి కుక్ కు వెళ్లిన సమాధానం ఏంటన్న విషయంపై సమాధానం లేదు. యాపిల్ యూఎస్ ఉద్యోగులు ఈ కేసును వేస్తూ, తమను తనిఖీలు చేసినందుకు నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉంది.