: లాలూ నివాసానికి నితీశ్... జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీహార్ సీఎం
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 68వ పుట్టినరోజు సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. నేరుగా ఆయన ఇంటికి వెళ్లిన నితీష్ పూలబొకే అందించారు. రెండు రోజుల కిందట ఆర్జేడీ, జేడీయూ కూటమి సీఎం అభ్యర్థిగా నితీశ్ పేరు ప్రకటించిన అనంతరం వారిద్దరూ కలవడం ఇదే తొలిసారి. తరువాత నితీశ్ మీడియాతో మాట్లాడుతూ, "మేము రాజకీయ నాయకులం, రాజకీయాలు మాట్లాడతాం. అయితే ఈరోజు లాలూజీ పుట్టినరోజు సందర్భంగా ఆయనను వ్యక్తిగతంగా విష్ చేసేందుకు వచ్చాను" అని చెప్పారు.