: రేవంత్, చంద్రబాబులపై అనుమానం వ్యక్తం చేస్తున్న సీపీఐ


సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించారు. ఈ వివాదంలో రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేని ప్రలోభపెట్టిన విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. చంద్రబాబు రాజకీయాల్లో ఉద్ధండుడని, ఆయన తన నిజాయతీ నిరూపించుకోవాలని సూచించారు. అటు, టీడీపీ తరపున నెగ్గి టీఆర్ఎస్ క్యాబినెట్లో మంత్రిగా ఎలా కొనసాగుతారంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ప్రశ్నించారు. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చాడ విమర్శనాస్త్రం సంధించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో కేసీఆర్ కూడా వైఎస్సార్ బాటలో పయనిస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News