: సమయమొచ్చినప్పుడు కేసీఆర్ బండారం బయటపెడతాం... ఏపీ డిప్యూటీ సీఎం కేఈ వ్యాఖ్య
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీడీపీ నేతల మాటల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కుమ్మక్కై కేసీఆర్ టీడీపీని ఇబ్బందిపెడుతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన కేఈ, ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం వచ్చినప్పుడు కేసీఆర్ బండారం బయటపెడతామని కేఈ అన్నారు. ఆ సమయం ఇంకెంతో దూరంలో లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.