: అత్యంత ధనిక క్రీడాకారుల్లో భారతీయుడొక్కడే!


ప్రపంచ ప్రసిద్థ ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన 'వరల్డ్స్ రిచ్చస్ట్ అథ్లెట్స్' జాబితాలో ఇండియా నుంచి ఒకే ఒక్కరికి స్థానం లభించింది. టాప్ 10 హైయస్ట్ పెయిడ్ అథ్లెట్లలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు ఒక్కటే చోటు దక్కించుకుంది. ఈ సంవత్సరం జాబితాలో బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ తొలి స్థానంలో నిలువగా, ఆపై గోల్ఫ్ స్టార్ టైగర్ వూడ్స్, టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, సాకర్ స్టార్ క్రిస్టియానా రొనాల్డోలు నిలిచారు. ధోనీకి 23వ స్థానం లభించింది. గత సంవత్సరంతో పోలిస్తే ధోనీ రెండు స్థానాలు దిగజారాడు. ఈ యేడు ధోనీ ఆదాయం 31 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 195 కోట్లు)గా ఉంటుందని ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ జాబితాలో మరే ఇతర భారత ఆటగాడికీ చోటు లభించక పోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News