: బాబు మంత్రి పదవి ఇవ్వనందుకే బతికాను...లేకుంటే నేనూ జైలుకే!: కేసీఆర్ వ్యాఖ్య
టీడీపీ అధినేత తనకు మంత్రి పదవి ఇవ్వనందుకే బతికిపోయానని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. నిన్న రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘‘మంత్రి పదవి ఇవ్వకుంటే తాను గొర్రెలు కాసుకునేవాడినని చంద్రబాబు అన్నారు. ఆయన మంత్రి పదవి ఇవ్వనందుకే నేను బతికాను. లేకుంటే నేనూ జైలుకెళ్లేవాడిని’’ అని కేసీఆర్ అన్నారు. ‘‘కుమ్మక్కులు, కుంభకోణాలకు చంద్రబాబు పెట్టింది పేరైతే, నేను మాత్రం ఫైటర్ ను. నాకు ముఖ్యమంత్రి పదవి ఎవరో ఇస్తే రాలేదు. ఒక లక్ష్యం కోసం పోరాడి, విజయం సాధించి, తెలంగాణ ప్రజల సహకారంతో సీఎం అయ్యాను’’ అని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు.