: నాగర్ కోయిల్ లో ముగ్గురి ఆత్మహత్య... వీరిలో విజయవాడ కల్యాణి కూడా ఉందా?
తమిళనాడులోని నాగర్ కోయిల్ లో ఓ బాబు సహా ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమెను కల్యాణిగా పోలీసులు అనుమానిస్తున్నారు. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు నిన్న సాయంత్రం కల్యాణి బంధువులకు లేఖ పంపించింది. విజయవాడ టీడీపీ అర్బన్ కార్యదర్శి పడాల కన్నా మృతి కేసులో కల్యాణి హస్తముందని ఆరోపణలు వెల్లువెత్తాయి. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ ఆమెపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీంతో ఆమె కుమారుడు, స్నేహితుడు సహా అదృశ్యమైంది. ఆమెను విచారించేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో నాగర్ కోయిల్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ ముగ్గురూ వీరే అయివుండచ్చని పోలీసులు భావిస్తున్నారు.