: నిషేధిత జాబితాలో కెల్లాగ్స్, టాటా స్టార్ బక్స్, వెంకీస్ 'రెడీ టూ ఈట్' మాంసం సహా 500 ఉత్పత్తులు
సీసం వంటి లోహాలు, కెఫిన్, సోడియం తదితరాలు పరిమితికి మించి ఉన్నాయని ఆరోపిస్తూ, పలు పేరున్న ఉత్పత్తులు సహా 500 ప్రొడక్టులను నిషేధిత జాబితాలో పెట్టినట్టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తెలియజేసింది. ఈ ఉత్పత్తులన్నీ నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలను కలిగి ఉన్నాయని పేర్కొంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధాన్ని ఎదుర్కొంటున్న ప్రొడక్టుల్లో టాటా సంస్థకు చెందిన స్టార్ బక్స్ సాస్, సిరప్, కెల్లాగ్స్ రెడ్ బెర్రీస్ సెరియల్, ర్యాన్ బాక్సీ మల్టీ విటమిన్ టాబ్లెట్లు, వెంకీస్ రెడీ టూ ఈట్ కోడి మాంసం తదితరాలతో పాటు పలు సంస్థలకు చెందిన సౌందర్య ఉత్పత్తులు, బరువు పెంచుతాయని ప్రచారం చేసుకుంటున్న ప్రొడక్టులు ఉన్నాయి.