: చంద్రబాబు తన పాత్రను ఒప్పుకున్నట్టే: కేటీఆర్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారంలో తన పాత్రను ఒప్పుకున్నట్టేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఈ వ్యవహారంలో తన పాత్ర లేదని ఆయన ఎక్కడా చెప్పడం లేదని అన్నారు. చంద్రబాబు పక్కా ఆధారాలతో దొరికిపోయాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని స్పష్టం చేశారు. బాబు ఢిల్లీలో ఎవరి కాళ్లు పట్టుకున్నా ప్రయోజనం ఉండదని అన్నారు. బాబు ఏపీకి సీఎం అయినా, తెలంగాణలో మాత్రం సాధారణ పౌరుడే అని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపారు. చంద్రబాబును లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ నిశితంగా విమర్శించిన వైనాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News