: హైదరాబాదులో క్షణక్షణం భయంభయంగానే బతుకుతున్నాం: ఏపీ ఆర్థిక మంత్రి యనమల


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధులకు భద్రత లేకుండా పోయిందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోందని ఆయన కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ అధికారాలు అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు నిర్భయంగా తమ సీఎం నారా చంద్రబాబునాయుడు ఫోన్ ను ట్యాపింగ్ చేయగలిగిందన్నారు. చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తమ వద్ద పక్కా సమాచారం ఉందని ఆయన వెల్లడించారు. ఈ అంశాలన్నింటినీ ప్రధాని, కేంద్ర మంత్రులకు వివరిస్తామని ఆయన చెప్పారు. విభజన సమస్యల పరిష్కారానికి తాము ముందుకు వస్తున్నా, తెలంగాణ సర్కారు ఉద్దేశపూర్వకంగానే మోకాలొడ్డుతోందని యనమల ఆరోపించారు.

  • Loading...

More Telugu News