: మయన్మార్ లోకి దూసుకెళ్లి 45 నిమిషాల్లో 100 మందిని మట్టుబెట్టిన భారత సైన్యం


అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ, మయన్మార్ లోకి దూసుకెళ్లిన భారత సైన్యం 45 నిమిషాల పాటు తుపాకులతో విరుచుకుపడి 100 మంది మిలిటెంట్లను మట్టుబెట్టినట్టు హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత దళాలు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, ఈ ఆపరేషన్ ను నిర్వహించాయని, మిలిటెంట్లకు ఒక్క రౌండ్ కాల్పులు జరిపే అవకాశం కూడా లభించలేదని తెలిపాయి. ఈ దాడిలో గాయపడి ప్రాణాలు దక్కించుకున్న మిలిటెంట్లను ఆసుపత్రుల్లో చేర్చినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం భారత వాయుసేన ఇండియా- మయన్మార్ సరిహద్దుల్లో సోదాలు జరిపి, భారత సైన్యంపై తెగబడ్డ మిలిటెంట్లు మయన్మార్ పారిపోయి అడవుల్లో నక్కారని స్పష్టం చేసిన నేపథ్యంలో భద్రతాదళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. భారత సైన్యం సరిహద్దులు దాటే ముందు మయన్మార్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్టు హోం శాఖ వెల్లడించింది. భారత సైన్యానికి మయన్మార్ సహకరించిందని, భద్రతాదళాలు ప్రవేశించిన సమయంలో మయన్మార్ సైన్యం ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిందని తెలిసింది. మరోవైపు నాగాలాండ్ బార్డర్ వద్ద ఆర్మీ, మిలిటెంట్లకు జరిగిన పోరులో 15 మంది మరణించినట్టు సమాచారం. సరిహద్దులు దాటిన భద్రతాదళాలు క్షేమంగా వెనక్కు తిరిగి వచ్చాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News