: స్టీఫెన్ సన్ కు బ్రదర్ అనిల్ కుమార్ తో సంబంధాలు: అచ్చెన్నాయుడు ఆరోపణ
ఓటుకు నోటు కేసులో కేంద్ర బిందువుగా మారిన తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో సంబంధాలున్నాయని ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ కారణంగానే ఈ కేసు కుట్రలో జగన్ కు పాత్ర ఉందని తాము భావిస్తున్నామని ఆయన కొద్దిసేపటి క్రితం ఆరోపించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఫోన్ ను ట్యాపింగ్ చేసిన అంశాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణలో ప్రముఖ నేతలు, ఉద్యమకారుల ఫోన్లపైనా కేసీఆర్ ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆయన ఆరోపించారు.