: రేవంత్ బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి... తీర్పు మధ్యాహ్నానికి వాయిదా


ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏసీబీ న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు కోరగా, సాక్షులను ప్రభావితం చేయగల సమర్థుడైనందున రేవంత్ కు బెయిల్ ఇవ్వరాదని ఏసీబీ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే, కూతురు వివాహ నిశ్చితార్థం ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని రేవంత్ తరఫు లాయర్లు న్యాయమూర్తిని కోరారు. కనీసం రెండు రోజుల పాటైనా బెయిల్ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రతిస్పందించిన ఏసీబీ లాయర్లు, మధ్యంతర బెయిల్ కు తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. నేటి సాయంత్రం నుంచి రేపటి వరకు బెయిల్ మంజూరు చేస్తే తమకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఎవరితోనూ సమావేశాలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తన తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News