: 'అమెరికన్ హోగ్వార్ట్స్' నేపథ్యంలో జేకే రౌలింగ్ కొత్త చిత్రం!


'హ్యారీ పోటర్' సిరీస్ లో నవలలు రాసి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రచయిత జేకే రౌలింగ్ తన తదుపరి నవలా చిత్రం 'ఫెంటాస్టిక్ బీట్స్ అండ్ వేర్ టు ఫైండ్ దెమ్'లో అమెరికన్ హోగ్వార్ట్స్ (మంత్రగాళ్ల కళాశాల) నేపథ్యం ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు. హ్యారీ పోటర్ సిరీస్ బ్రిటీష్ హోగ్వార్ట్స్ నేపథ్యంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ట్విట్టర్ మాధ్యమంగా తన అభిమానులడిగిన ప్రశ్నలకు రౌలింగ్ సమాధానాలు ఇచ్చారు. కొత్త చిత్రం హీరో న్యూయార్క్ పాఠశాలకు వెళ్తాడా? అని ప్రశ్నించగా, ఆ విషయంపై సమయం వచ్చినప్పుడు సమాధానం తెలుస్తుందని రౌలింగ్ జవాబిచ్చారు. హోగ్వార్ట్స్ నేపథ్యం అమెరికన్-ఇండియన్ కల్చర్ పెనవేసుకున్నట్టు ఉంటుందా? అని మరో అభిమాని ప్రశ్నించగా, తన ఆన్సర్ అవునని భావించవచ్చని, మరింత వివరాలు ఇస్తే హోగ్వార్ట్స్ లొకేషన్ తెలిసిపోయి సస్పెన్స్ ఉండదని అన్నారు. కాగా, వచ్చే సంవత్సరం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రను, ఆస్కార్ గ్రహీత ఎడ్డీ రెడ్మయిన్ పోషించనున్నారు. హోగ్వార్ట్స్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు రచించే మ్యాజిజూలజిస్టుగా ఆయన కనిపించనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News