: మారన్ సోదరులకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ


కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్ లకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారికి చెందిన రూ.742 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేయడంపై స్టే ఇవ్వాలని కోరుతూ సోదరులిద్దరు కోర్టును ఆశ్రయించారు. అయితే, న్యాయస్థానం ఆ పిటిషన్ ను విచారించి, కొట్టివేసింది. ఎయిర్ సెల్, మాక్సిస్ ఒప్పందంలో మారన్ సోదరులిద్దరూ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. ప్రస్తుతం విచారణ కూడా జరుగుతోంది.

  • Loading...

More Telugu News