: మందు కొట్టి కారు నడుపుతూ, ఇద్దరి మృతికి కారణమైన మహిళా న్యాయవాది
ఆమె ఓ మహిళా న్యాయవాది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో న్యాయ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. పేరు జాహ్నవీ గడ్కర్ (35). సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్న ఆమె మద్యం సేవించి కారు నడపడమే కాదు, ఆ మత్తులో ఇద్దరు మరణానికి కారణమైంది. తన ఆడీ క్యూ-3 కారును రాంగ్ రూటులో నడిపిస్తూ, ఓ టాక్సీని బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో టాక్సీలో వెడుతున్న సాబూవాలా (50), హుస్సేన్ సయీద్ (57)లు మరణించారు. టాక్సీని ఢీకొట్టే ముందు ఆమె రెండు బైకులను ఢీకొట్టబోయి తృటిలో తప్పించిందని తెలుస్తోంది. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆమె మద్యం తాగినట్టు అంగీకరించారని పోలీసులు తెలిపారు.