: రాష్ట్రపతిని కలిసి చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన జగన్
ఏపీ సీఎం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ కోరుతున్నారు. ఆయన నేడు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఉభయ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు వ్యవహారాన్ని జగన్ రాష్ట్రపతికి వివరించారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, చంద్రబాబు ఫోన్ సంభాషణలుగా భావిస్తున్న ఆడియో టేపులు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. దాంతో, ఆయనపై అటు ఏపీలో విపక్షాలు విరుచుకుపడుతుండగా, ఇటు తెలంగాణలో కేసులో నిందితుడిగా చేర్చేందుకు రంగం సిద్ధమవుతోంది.