: నాకంటే గొప్ప మాటకారి, మంచి సేల్స్ మెన్!: మోదీపై మన్మోహన్ వ్యంగ్యం
ప్రధాని మోదీపై మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ తనదైన శైలిలో సునిశిత విమర్శలు చేశారు. ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. మాటలు చెప్పడంలో నరేంద్ర మోదీ తనకన్నా ముందు నిలిచాడని అభివర్ణించారు. తనకన్నా మోదీ మంచి సేల్స్ మెన్ అని అంగీకరించాల్సిందేనని, అంతకుమించిన గొప్ప ఈవెంట్ మేనేజరని ఎద్దేవా చేశారు. యూపీఏ ప్రవేశపెట్టిన పలు స్కీముల పేర్లు మార్చి తన గొప్పగా మోదీ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.