: చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ కు రంగం సిద్ధం?


ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ వ్యవహారంలో బాబు పాత్రపై పక్కా ఆధారాలను ఏసీబీ సంపాదించినట్టు అర్థమవుతోంది. రేపు గానీ, ఎల్లుండి గానీ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఏసీబీ అధికారులు కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ కస్టడీలో ఉన్న నిందితులు కీలక సమాచారం వెల్లడించినట్టు ప్రచారమవుతోంది. ఆ సమాచారం ఆధారంగానే, తొలుత చంద్రబాబుకు నోటీసులు పంపి, ఆపై ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేయాలన్నది ఏసీబీ కార్యాచరణగా కనిపిస్తోంది. తదనంతరం, ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేయడంపై ఓ నిర్ణయం తీసుకుంటారు. కాగా, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉండడంతో ఆయనకు నోటీసులు జారీ చేసే విషయంలో ఏసీబీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. సెక్షన్ 160 (సీఆర్పీసీ) కింద, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా నోటీసులు జారీచేసే అధికారం ఇన్వెస్టిగేషన్ అధికారికి ఉంటుంది. నోటీసుల విషయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకున్న ఏసీబీ ఆ దిశగా కసరత్తులు చేస్తున్నట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News