: విఫలమైన నాసా 'ఎగిరే పళ్లెం' పరీక్ష
విప్లవాత్మక ఫ్లయ్యింగ్ సాసర్ (ఎగిరే పళ్లెం) టెక్నాలజీని పరీక్షించి మార్స్ పైకి మానవులను పంపాలని ప్రయత్నాలు జరుపుతున్న నాసాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎల్ డీఎస్ డీ (లో డెన్సిటీ సూపర్ సోనిక్ డిసిలిరేటర్) పేరిట తయారు చేసిన ఫ్లయ్యింగ్ సాసర్ ప్రయోగం విఫలమైంది. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది. బెలూన్ ద్వారా 1.2 లక్షల అడుగుల ఎత్తునకు దీన్ని పంపామని, ఆ ఎత్తులో రాకెట్లను మండించి ఫ్లయ్యింగ్ సాసర్ ను విజయవంతంగా కిందకు దింపాలన్నది తమ లక్ష్యమైతే, దురదృష్టవశాత్తూ విఫలమైనామని తెలిపింది. డేటాను విశ్లేషిస్తున్నామని, మరోసారి ఈ ప్రయోగం జరుపుతామని వివరించింది. కాగా, హవాయి ద్వీపంలో ఇదే తరహా పరీక్షను జూన్ 2014లో జరిపి నాసా విఫలమైంది.