: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం... అడ్డుకున్న పోలీసులు
ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మాట్లాడినట్లుగా భావిస్తున్న ఆడియో టేపులపై టీడీపీ మహిళా విభాగం కార్యకర్తలు భగ్గుమన్నారు. హైదరాబాదులోని తమ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద తెలుగు మహిళలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. అయితే విషయాన్ని గమనించిన పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మహిళలను అడ్డకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.