: బాలయ్య కొత్త సినిమాలూ ఇంటివద్దే చూసుకోవచ్చు...చంద్రబాబు నోట సినిమా మాట!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి నోట సినిమా మాట వినబడింది. అది కూడా తన బావమరిదిగానే కాక వియ్యంకుడుగానూ మారిన టాలీవుడ్ అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాల గురించి చంద్రబాబు మాట్లాడారు. నిన్నటి మహా సంకల్ప వేదికపై ప్రసంగించిన సందర్భంగా బాలయ్య సినిమాలను చంద్రబాబు ప్రస్తావించడం విశేషం. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు, నెలకు కేవలం రూ.100కే 10-20 ఎంబీపీఎస్ స్పీడ్ తో కనెక్షన్లనిస్తామని చెప్పారు. ఈ కనెక్షన్ ద్వారా టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ ను అందిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కనెక్షన్ ద్వారా ఎలాంటి వెసులుబాటు లభిస్తుందన్న విషయాన్ని చంద్రబాబు కాస్త ఆసక్తికరంగా చెప్పారు. ‘‘ఈ కనెక్షన్ తో మీరు ఏ సినిమా కావాలంటే, ఆ సినిమా చూసుకోవచ్చు. భర్త ఒక సినిమా, భార్య మరొక సినిమా రెండు టీవీల్లో చూసుకోవచ్చు. కొత్త సినిమాలు చూసుకోవచ్చు. కొత్తగా వచ్చే బాలకృష్ణ సినిమాలూ చూసుకోవచ్చు. క్లాస్ ఎగ్గొడితే ఇంటివద్దే చదువుకోవచ్చు’’ అని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News