: చంద్రబాబు రాజీనామా చేయాలి: చాడ వెంకటరెడ్డి


నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబునాయుడు రాజీనామా చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ, ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి పాత్రధారి అయితే, చంద్రబాబు సూత్రధారి అని తెలంగాణ హోం మంత్రి వరంగల్ లో వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ తో వాస్తవాలు బహిర్గతమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పదవికి రాజీనామా చేసి నైతికత చాటుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News