: అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం
అరేబియా మహా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 24 నుంచి 36 గంటల్లో ఆ అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పింది. మహారాష్ట్రలోని ముంబయికి నైరుతి వైపుగా అరేబియా సముద్రంలో అల్ప పీడన ప్రాంతం ఏర్పడిందని వాతావరణ శాఖ వివరించింది. దాని ప్రభావంతో రాగల 24 గంటల్లో కర్ణాటక, కొంకణ్, గోవా, గుజరాత్ తీర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.