: సీసీ కెమేరాకి నల్లరంగు పూసి...ఏటీఎం లేపేశారు
ఏటీఎంల లోంచి నగదు ఎత్తుకెళ్లడం, ఏటీఎంలలో దూరి డబ్బు డ్రా చేసుకునే వారిని బెదిరించి నగదు దోచుకెళ్లడం కంటే ఏటీఎంనే లేపేయడం బెటర్ అనుకున్నారు దొంగలు. పంజాబ్ లోని ఫరీద్ కోట్ లో ఏకంగా ఏటీఎంనే లేపేశారు. మహాత్మాగాంధీ స్మారక స్థూపం పక్కనే ఉన్న ఓ జాతీయ బ్యాంకుకు చెందిన ఏటీఎంను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. తమని గుర్తించకుండా ఉండేందుకు సీసీ కెమేరాకు నల్ల రంగు పూసి తతంగం పూర్తి చేశారు. కాగా, ఏటీఎంలో 2.80 లక్షల రూపాయల నగదు ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పంజాబ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉదంతాలు గతంలో చోటుచేసుకోగా, పట్టణంలోనే ఏటీఎంను లేపేయడం విశేషం.