: "బాబు గారు గోయింగ్ టు టాక్ టు యూ"... అని పేర్కొన్న గొంతు ఎవరిది?... తెలుసుకునేందుకు ఏసీబీ తీవ్ర యత్నాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడినట్టు భావిస్తున్న ఆడియో టేపుల్లో తొలుత వినిపించిన గొంతు ఎవరిదన్న విషయం తెలుసుకునేందుకు ఏసీబీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు-స్టీఫెన్ సన్ మధ్య జరిగిన సంభాషణల తాలూకు ఆడియో టేపులో తొలుత ఓ వ్యక్తి "బాబు గారు గోయింగ్ టు టాక్ టు యూ... స్టే ఆన్ ద లైన్" అని స్టీఫెన్ సన్ తో పేర్కొనడం వినిపిస్తుంది. మొదట వినిపించిన ఆ గొంతు ఎవరిదన్న విషయం తెలుసుకుంటే కేసులో మరింత ముందుకెళ్లేందుకు ఉపకరిస్తుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాగా, ఓటుకు నోటు వ్యవహారంలో నిందితుడైన సెబాస్టియన్ హ్యారీదే ఈ గొంతు అని సమాచారం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. డీల్ మొత్తాన్ని సెబాస్టియన్ నడిపించి ఉంటాడని ఏసీబీ అధికారులు విశ్వసిస్తున్నారు.