: బద్ధకిస్టు అమ్మలతోనే మ్యాగీకి ఇంత ప్రాచుర్యం: బీజేపీ
మ్యాగీ నూడుల్స్ వంటి ఇన్ స్టంట్ ఆహారం అమ్మకాలు గణనీయంగా పెరగడానికి తల్లుల బద్ధకమే ప్రధాన కారణమని బీజేపీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. గతంలో పిల్లలకు పరాఠాలు, హల్వా, సేమియా వంటివి వండి పెట్టే తల్లులు ఇంత బద్ధకంగా ఎందుకు తయారయ్యారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. మ్యాగీపై నిషేధాన్ని ఆమె సమర్థించారు. భారతీయ అమ్మల గురించి ఇలా మాట్లాడటాన్ని కాంగ్రెస్ ఖండించింది. ఆమె తల్లులందరినీ అవమానించారని మధ్యప్రదేశ్ మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు అర్చనా జైశ్వాల్ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు.