: ఓటుకు నోటు కేసులో కొత్తమలుపు... బయటకొచ్చిన బాబు ఆడియో... తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు


ఓటుకు నోటు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్ ను కలసి వచ్చిన కాసేపటికే, నామినేటెడ్ ఎంఎల్ఎ స్టీఫెన్ సన్ తో బాబు మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ బహిర్గతమై సంచలనం కలిగించింది. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. కాగా, ఈ ఫోన్ సంభాషణను ఏసీబీ వెలికి తీసింది. రేవంత్‌ రెడ్డి కాల్‌ డేటాను విశ్లేషిస్తున్న సమయంలో బాబు మాటల వివరాలు లభించాయని సమాచారం. అరెస్టుకు ముందు 4 రోజులు.. తర్వాత 3 రోజుల కాల్‌డేటాను ఏసీబీ పరిశీలన చేసినట్టు తెలుస్తోంది. ఫోన్‌ సంభాషణల్లో 50 నుంచి 75 సార్లు చంద్రబాబు ప్రస్తావన వచ్చిందని అధికారులు తెలిపారు. రేవంత్‌ రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయ్‌ సింహా ఫోన్‌ లకు వచ్చిన కాల్స్ పైనా అధికారులు ఆరా తీశారు. 20 మంది కాల్‌డేటాను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం విదితమే. ఏసీబీ అధికారుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.

  • Loading...

More Telugu News