: రాహుల్ మనసులో బ్లూప్రింట్ ఉంది... రెండు నెలల్లో మార్పును మీరే చూస్తారు: జ్యోతిరాదిత్య సింధియా


రెండు నెలల పాటు విరామం తీసుకొని వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా సమర్థించారు. ప్రస్తుతం ఆయన మనసులో ఓ బ్లూ ప్రింట్ ఉందని... రానున్న ఒకటి, రెండు నెలల్లో మార్పును మీరే చూస్తారంటూ వ్యాఖ్యానించారు. తన వద్ద ఉన్న బ్లూ ప్రింట్ తో కాంగ్రెస్ పార్టీలో నూతనోత్తేజాన్ని రాహుల్ నింపుతారని సింధియా అన్నారు. రైతుల అంగీకారం లేకుండా వారి భూమిని ఎలా తీసుకుంటారని భూసేకరణ బిల్లుపై మాట్లాడుతూ అన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ, మన దేశంలో మాత్రం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News