: విజయనగరంలో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు
విజయనగరంలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్థానికుల సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు, పది మందిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలోని కొత్తపేట కూడలి దగ్గర్లోని ఆర్ఎం కాలనీలో ఓ నివాసాన్ని అద్దెకు తీసుకుని, పది మంది అంగరక్షకులను ఏర్పాటు చేసుకుని; కాకినాడ, రాజమండ్రి, విశాఖ, విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన యువతులతో ఓ ముఠా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తోంది. స్థానికుల ఫిర్యాదుతో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, ఆ గృహంపై దాడి చేశారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.