: అర్చకుల వేతనాల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం


ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలంటూ తెలంగాణ అర్చకులు చేసిన ఆందోళనకు ఫలితం లభించింది. దీపధూప నైవేద్యం కింద పనిచేస్తున్న అర్చకులకు గౌరవవేతనం పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అర్చకులతో ఈ రోజు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని మీడియాకు చెప్పారు. అర్చకుల వేతనం రూ.2500 నుంచి రూ.6వేల వరకు పెంచుతామని, దానిపై నేడో రేపో జీవో కూడా జారీ చేస్తామని వెల్లడించారు. పెరిగిన జీతం జూన్ నుంచి అమలవుతుందన్నారు. అర్చకులకు తెలంగాణ ఇంక్రిమెంట్లు కూడా ఇస్తామన్నారు. అయితే అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా జీతాల చెల్లింపుపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, నెల రోజుల్లో ఆ కమిటీ నివేదిక సమర్పిస్తుందని మంత్రి వివరించారు. నివేదిక వచ్చాక రెండు నెలల్లో వేతనాల చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

  • Loading...

More Telugu News