: ఇండోనేషియా ఓపెన్ నుంచి కశ్యప్ నిష్క్రమణ
జకార్తాలో జరుగుతున్న ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ లో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ పోరాటం ముగిసింది. ఈ సిరీస్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ 8వ సీడెడ్ క్రీడాకారుడు జపాన్ కు చెందిన మొమొట కెంటో చేతిలో పరాజయం పాలయ్యాడు. వారిద్దరి మధ్య జరిగిన గంటా 11 నిమిషాల మ్యాచ్ లో 21-12, 17-21, 19-21 తేడాతో కశ్యప్ ఓడిపోయాడు. లీగ్ మ్యాచ్ లో ఐదో సీడ్, క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడిని కశ్యప్ ఓడించిన విషయం తెలిసిందే.