: రెండు నెలల ముందుగానే రానున్న హ్యుందాయ్ 'క్రెటా'... పండగ సీజన్ కోసమే!
సౌత్ కొరియా సంస్థ హ్యుందాయ్ రెండు నెలల ముందుగానే కాంపాక్ట్ ఎస్ యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) 'క్రెటా'ను రెండు నెలల ముందుగానే భారత మార్కెట్లో విడుదల చేయనుంది. తొలుత ఈ కారును సెప్టెంబర్ తరువాత విడుదల చేయాలని భావించినప్పటికీ, రంజాన్ నుంచి దీపావళి వరకూ ఉండే పండగ సీజన్ అడ్వాంటేజిని పోగొట్టుకోవడం ఇష్టంలేని సంస్థ జులై 21న కారు విడుదలకు ముహూర్తం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ కారుకు మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్న సంస్థ ఈ నెల 20 నుంచి కారు తయారీని ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రొడక్షన్ యూనిట్ లో ఇప్పటికే మార్పులు చేసినట్టు తెలిసింది. పెట్రోలు, డీజిల్ వేరియంట్లలో, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తదితర సదుపాయాలతో లభించే ఈ కారు ధర రూ. 8 నుంచి రూ. 12 లక్షల మధ్య ఉంటుందని అంచనా.